రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని వినూత్నంగా నిరసన

గోల్డెన్ న్యూస్/ కామారెడ్డి : కామారెడ్డిలోని అశోక్ నగర్ ప్రధాన రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు సోమవారం నిరసన తెలిపారు. రోడ్డుపై నిలిచిన నీటిలో వరి నాట వేసి వినూత్నంగా నిరసన తెలిపారు. ఏళ్ల నుంచి రోడ్డు పాడైనా మరమ్మతులు చెప్పట్టడం లేదని వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అరకల ప్రభాకర్ యాదవ్, నాయకులు జగదీష్ యాదవ్, లోలపు శ్రీనివాస్, గంగారం యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram