గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ ఎన్నికలక ముందు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని 1969 తెలంగాణ ఉద్యమకారుల సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి కేజీఎస్ మాథ్యూస్ డిమాండ్ చేశారు. సోమవారం కొత్తగూడం పట్టణంలోని పోస్టాఫీసు సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టరు వేణుగోపాల్ కు వినతి పత్రం అందజేశారు. 1969 ఉద్యమంలో పోలీసు కాల్పుల్లో చనిపోయిన వారికి రూ.25 లక్షల ఆర్థిక సహాయం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, పోలీసు కాల్పుల్లో గాయపడ్డ ఐదుగురికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ప్రభుత్వ సహయం చేయాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని వినతి పత్రంలో పేర్కొన్నారు..
Post Views: 38









