పెండింగ్ వేతనాలను తక్షణమే చెల్లించాలి : సిఐటియు
గోల్డెన్ న్యూస్ /కరకగూడెం: కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఆలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జులై 9న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో గ్రామపంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు నాయకులు కొమరం కాంతారావు పిలుపునిచ్చారు మండల కేంద్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాల కోసం పాకులాడుతూందన్నారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలతో కార్మికులకు కనీస వేతనం చట్టం అమలు కావట్లేదని ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేస్తూ 12 గంటల నుంచి 18 గంటల పని చేయాలని కార్మికుల శ్రమను దోచుకునే విధంగా చట్టాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు గ్రామ పంచాయితీల కార్మికులకు పెండింగ్ లేకుండా నెలవారి వేతనాలను అందించేందుకు గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లిస్తామని చెప్పి ఇప్పటికే రెండు నెలల వేతనం పెండింగ్లో ఉందని గ్రామపంచాయతీలో తగినంత సిబ్బంది లేక పారిశుద్ధ్యం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉండేలా తయారవుతుందని వర్షాకాలం సమీపిస్తున్న వేళ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలు తక్షణమే నెరవేర్చాలని, జీవో నెంబర్ 51 సవరించి, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని , గ్రీన్ అంబాసిడర్ లాగా పనిచేసిన వారికి పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు అనంతరం సమ్మెకు సంబంధించిన నోటీసు సమస్యలతో వినతి పత్రం మండల పంచాయితీ అధికారి మారుతికి అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మిక సంఘం మండల అధ్యక్షులు గుమ్మడవెల్లి కృష్ణ ,ఉప్పలి సాంబశివరావు, ధనంజయ్, రమేష్, సాంబశివరావు, ప్రశాంత్ ,శ్రీను, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు









