పని గంటల పెంపును విరమించుకోవాలి  

⇒ పని గంటల పెంపును విరమించుకోవాలి.  ⇒నాలుగు లేబర్ కోడ్ లను తక్షణమే రద్దు చేయాలి.

⇒ మండల కేంద్రంలో ప్రదర్శన – సిఐటియు.   

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం : లేబర్ కోడ్ ల అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పని గంటలను విరమించుకోవాలని, నాలుగు లేబర్ కోడ్లు తక్షణమే రద్దు చేయాలని సిఐటియు నాయకులు కొమరం కాంతారావు డిమాండ్ చేశారు. కేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులను రద్దు చేయడం కోసం లేబర్ కోడ్ లను తీసుకొచ్చిందని ఇది ప్రజాస్వామ్య ప్రక్రియకే విరుద్ధమైన చర్యాన్ని సిఐటియు విమర్శించింది. దేశంలో ఉత్పత్తి వర్గాలైన కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు దేశ జనాభాలోని అత్యధిక భాగం కేంద్రం బిజెపి ప్రభుత్వ విధానాల వల్ల సమస్యలను ఎదుర్కొంటున్నారని సిఐటియు తెలిపింది. దేశంలో పేదరికం పెరుగుతుందని సంపద మొత్తం కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమవుతుందని జూలై ఆరో తేదీన ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో స్వయానా కేంద్ర మంత్రి నితిన్ గడ్గరి ప్రస్తావించారని ఇది దేశం యొక్క ఆర్థిక పరిస్థితి దిగజారి పోతుందన్న వాస్తవ పరిస్థితులకు నితిన్ గడ్గరి మాటలు అద్దం పడుతున్నాయని వారు పేర్కొన్నారు. ఉత్పత్తిలో భాగస్వాములు అవుతున్న కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల యొక్క ఆదాయాలు గణనీయంగా తగ్గిపోయాయని ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందని దీని పర్యావసానమే దేశ ఆర్థిక పరిస్థితి సంక్షోభంలోకి నెట్టివేయబడుతుందని సిఐటియు పేర్కొన్నది .ప్రభుత్వ వైఫల్యాలను ఆర్థిక సంక్షోభాన్ని దేశ ప్రజల నిజమైన సమస్యలను పక్కదారి పట్టించడం కోసమే ప్రజల మధ్య భావోద్వేగాలను కేంద్ర బిజెపి ప్రభుత్వం రెచ్చగొడుతుందని సిఐటియు విమర్శించింది. కార్మిక వర్గానికి న్యాయబద్ధంగా కనీస వేతన చట్టాలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఉపాధి పనులు చేస్తున్న వ్యవసాయ కూలీలకు ఉపాధి పని 200 రోజులకు పెంచీ, కనీస వేతనం 600 రూపాయలు ఇవ్వాలని రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలో కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు సిఐటియు నేతృత్వంలో భారీ ఎత్తున ప్రదర్శన నిర్వహించారు కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి వంగర సతీష్, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు బిలపాటి శంకరయ్య ,సుతారి కాంతారావు ,తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం మండల కార్యదర్శి చర్ప సత్యం, వివిధ రంగాల మండల నాయకులు భవాని, సుజాత ,భద్ర కళ, రమాదేవి, తాటి లక్ష్మి, వెంకన్న ,సాంబమూర్తి ,కృష్ణ, సాంబశివరావు ,ధనంజయ్ ఆటో యూనియన్ నాయకులు సాంబశివరావు రంజిత్ లక్ష్మీనారాయ తదితరులు పాల్గొన్నారు

Facebook
WhatsApp
Twitter
Telegram