నామినేషన్ల కేంద్రాలను పరిశీలించిన డీఎస్పీ

గోల్డెన్ న్యూస్/ కరకగూడెం / స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కరకగూడెం మండలంలో ఎన్నికల సందడి మొదలైంది. ఈ క్రమంలో మండల పరిధిలోని కరకగూడెం, సమత్ మోతేలోని గొల్లగూడెం గ్రామంలో ఏర్పాటుచేసిన చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను  మణుగూరు డి.ఎస్.పి రవీందర్ రెడ్డి, ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు తీసుకున్న భద్రతా చర్యలను, బందోబస్తు ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. డీఎస్పీ  వెంట కరకగూడెం ఎస్సై పివి నాగేశ్వరరావు, అధికారులు, ఇతర సిబ్బంది ఉన్నారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram