చిన్నారిని నేలపై పడేసి కొట్టిన ఆయా

 

గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్పాఠశాల అంటే దేవాలయం తో సమానమని తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపిస్తుంటారు అక్కడైతే తమ చిన్నారులను కంటికి రెప్పలా సంరక్షిస్తారని వారు విశ్వసిస్తుంటారు. అయితే వారి నమ్మకాన్ని వమ్ము చేసేలా ఆయా పసిపాప పట్ల దారుణంగా వ్యవహరించింది. హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని షాపూర్‌ నగర్‌లో ఓ ప్రైవేటు పాఠశాలలో నర్సరీ విద్యార్థిని పట్ల ఆయా అమానవీయంగా ప్రవర్తించింది. పాఠశాల ముగిసిన తర్వాత చిన్నారిని ఆయా కాలుతో తొక్కుతూ కర్కశంగా కొట్టింది. ఈ ఘటనను పాఠశాల పక్కనున్న భవనంపై నుంచి ఓ యువకుడు వీడియో తీయగా, అది స్థానికంగా వైరల్ అయ్యింది. ఈ వీడియో ఆధారంగా బాలిక తల్లిదండ్రులు ఆయాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న బాలికను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram