ప్రేమోన్మాది ఘాతుకం.. యువతి గొంతుకోసి హత్య

ప్రేమ పేరుతో పాశవికం

యువతిని గొంతుకోసి హత్య చేసిన ప్రియుడు

తలను వెంట తీసుకెళ్లి పరారీ.

 

యూపీలోని సహరాన్‌పూర్‌ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారంలో విభేదాలు తలెత్తడంతో యువతి ప్రియుడు ఆమెను దారుణంగా హత్య చేశాడు. గొంతు కోసి చంపిన అనంతరం యువతి తలను తనతో తీసుకెళ్లి నిందితుడు పరారయ్యాడు.

 

స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువతి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ఘటన ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.

 

నిందితుడి అరెస్టుకు పోలీసులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram