కుమారుల మృతిని తట్టుకోలేక..20 రోజుల వ్యవధిలో దంపతుల ఆత్మహత్య

గోల్డెన్ న్యూస్ / ఖమ్మం / తల్లాడ మండలంలోని మిట్టపల్లిలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ పేలిన ప్రమాదంలో ఇద్దరు కవల కుమారులు మృతి చెందడంతో, వారిని తట్టుకోలేక భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలతో తీవ్ర మనస్తాపానికి గురైన భర్త గుత్తికొండ వినోద్ కుమార్ (36) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నెల 7న ఉరేసుకున్న అతడు చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. గత ఏడాది ఏప్రిల్ 28న జరిగిన ప్రమాదంలో కవల కుమారులు వరుణ్, తరుణ్ మృతి చెందగా, ఈ నెల 1న భార్య రేవతి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram