గోల్డెన్ న్యూస్ / తాడ్వాయి / ములుగు జిల్లా మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు రోజులు దగ్గర పడుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన ఈ మహోత్సవం ప్రతి రెండేళ్లకోసారి వైభవంగా నిర్వహించబడుతుంది. దేశం నలుమూలల నుంచే కాదు, విదేశాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ జాతరను ‘దక్షిణ భారత కుంభమేళా’గా పిలుస్తారు. గిరిజనుల ఆరాధ్య దైవాలైన సమ్మక్క–సారలమ్మలకు అంకితమైన ఈ ఉత్సవం వారి సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. మేడారంలో సమ్మక్క-సారలమ్మ ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో భక్తుల రద్దీ పెరిగింది. పెరుగుతున్న చలి తీవ్రతను ఆసరాగా చేసుకుని, జంపన్న వాగు సమీపంలో వేడి నీటిని ఒక్కో బకెట్‌కు రూ.50 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ అధిక ధరతో భక్తులు ఆశ్చర్యపోతున్నారు. ఈ విక్రయాల ద్వారా వేలల్లో సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా జాతర జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది. 28న సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులు గద్దెలపై కొలువుదీరనుండగా, 29న చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెలకు చేరుకుంటారు.









