భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త.

భార్యకు మరొకరితో ఉన్న వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న ఓ భర్త. కట్టుకున్న భార్య మరోవ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలిస్తే ఆలోచించకుండా దారుణాలకు ఒడిగడుతున్న ఈ రోజుల్లో..ఓ వ్యక్తి మాత్రం తన భార్య వివాహేతర సంబంధం గురించి తెలుసుకొని వినూత్న నిర్ణయం తీసుకున్నాడు పెళ్లై 10 ఏళ్ల తర్వాత తన భార్యకు ఆమె, ప్రియుడితో వివాహం జరిపించాడు.

వివరాల్లోకి వెళితే,

ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. వివాహమైన 10 ఏళ్ల తర్వాత, భర్త ఆశిష్ తివారీ తన భార్య పింకీ వివాహాన్ని ఆమె ప్రియుడు అమిత్ శర్మతో జరిపించాడు. గ్రామ ఆలయంలో దండలు మార్చుకుని వివాహం చేసుకున్న తర్వాత, పింకీ తన పిల్లలను తనతో రమ్మని కోరింది. అయితే, పిల్లలు తమ తండ్రిని విడిచిపెట్టిన తల్లితో తాము ఉండబోమని, తమను మర్చిపోవాలని నిరాకరించారు. ఈ సంఘటన గ్రామంలో చర్చనీయాంశమైంది,.

Facebook
WhatsApp
Twitter
Telegram