ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి : డీజీపీ శివధర్ రెడ్డి

గోల్డెన్ న్యూస్ / తెలంగాణ / మున్సిపల్ ఎన్నికలను చట్టప్రకారం, ప్రశాంత వాతావరణంలో సమర్థవంతంగా నిర్వహించాలని డీజీపీ బి. శివధర్ రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మున్సిపల్ ఎన్నికలు జరగనున్న ప్రాంతాల పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, ఎస్‌హెచ్‌వోలుతో ఆయన సమావేశమయ్యారు.

 

రాష్ట్రవ్యాప్తంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, 414 కార్పొరేషన్ వార్డులు మరియు 2,582 మున్సిపల్ వార్డుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలని పోలీస్ అధికారులకు డీజీపీ దిశానిర్దేశం చేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram