బంగారానికి మించి ఈ చెట్టు. కేజీ రూ.కోటి

కేజీ రూ.కోటి: బంగారానికి మించి ఈ చెట్టు.. ఎందుకు?

 

భూమిలోంచి తవ్వి తీసే బంగారమే ఖరీదనుకుంటే పొరపాటే! విలువలో బంగారాన్ని కూడా మించి పోయే ఒక చెట్టు ఉంది. అదే అగర్వుడ్. ఆగ్నేయాసియాలో పెరిగే అక్విలేరియా జాతి చెట్లలో అరుదుగా ఏర్పడే ఈ కలప ధర కేజీ అక్షరాలా రూ.కోటి. మొత్తం చెట్లలో కేవలం 2–7 శాతం చెట్లలో మాత్రమే, అది కూడా 10 నుంచి 30 ఏళ్ల తర్వాత ప్రత్యేక ఫంగస్ లేదా గాయం కారణంగా ఈ అద్భుతం జరుగుతుంది. అత్యంత నాణ్యమైన ‘క్యారా’ రకం అయితే గ్రాముకు రూ.8.5 లక్షల వరకూ ధర పలుకుతోంది. తాజాగా షాంఘై వేలంలో 2 కేజీల క్యారా కలప రూ.154 కోట్లకు అమ్ముడవ్వడం సంచలనం. ఖరీదైన పెర్ఫ్యూమ్స్, ధూపం, ఆయుర్వేద వైద్యం, మతాచారాల్లో విస్తృత వినియోగమే దీనికి కారణం. మన దేశంలో అసోంలో లభించే ఈ చెట్లు డిమాండ్ పెరుగుతున్న కొద్దీ అరుదైపోతున్నాయి.

Facebook
WhatsApp
Twitter
Telegram