మానసిక వికలాంగ బాలిక పై పలు మార్లు అత్యాచారం.

మానసిక వికలాంగ బాలిక పై పలు మార్లు అత్యాచారం…

యువకుడిపై పోక్సో కేసు నమోదు

 

గోల్డెన్ న్యూస్ / పిడుగురాళ్ల / పల్నాడు జిల్లా పిడుగురాళ్ల తుమ్మలచెరువు గ్రామానికి చెందిన యువకుడు, మండలంలోని ఓ గ్రామానికి చెందిన మానసిక వికలాంగ బాలికపై అత్యాచారం చేశాడు.

 

బాలిక ఆరోగ్యం బాగోలేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా, ఆమె గర్భం దాల్చినట్లు వైద్యులు నిర్ధారించారు.

 

ఈ ఘటనపై కుటుంబ సభ్యులు శుక్రవారం పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో, ఎస్సై డి.శివనాగరాజు పోక్సో కేసు నమోదు చేశారు.

 

గురజాల డీఎస్పీ మహేశ్వరరావు ఈ కేసుపై విచారణ చేపట్టారు.

 

బాలికను నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram