సరిపడా ఆర్టీసీ బస్సు సర్వీసుల్లేక ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు.బస్సు సిట్టింగ్ కెపాసిటీ 54, ఎక్కేది మాత్రం 120, ఏజెన్సీ గ్రామాల ప్రజల ఇబ్బందులు పట్టించుకునేది ఎవరు ఎవరు.
గోల్డెన్ న్యూస్ / కరకగూడెం / సరిపడా ఆర్టీసీ బస్సు సర్వీసుల్లేక ఏజెన్సీ ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు.బస్సు సిట్టింగ్ కెపాసిటీ 54, ఎక్కేది మాత్రం 120, ఏజెన్సీ గ్రామాల ప్రజల ఇబ్బందులు పట్టించుకునేది ఎవరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల ప్రజలకి నిత్యం నరకయాత తప్పడం లేదు.మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి వందలాది మంది విద్యార్థులు చదువుల నిమిత్తం వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు.వీరందరూ ఆర్టీసీ బస్సులనే ఆశ్రయిన్నారు.ఆయా సమయాల్లో తగినన్ని బస్సులు లేక విద్యార్థులు ముప్పుతిప్పలు పడుతున్నారు. రంగాపురం నుండి మణుగూరు వెళ్లే TSRTC బస్సులో తీవ్ర నరకయాతన అనుభవిస్తున్నారు. 54 సీట్ల కెపాసిటీ ఉన్న ఆర్డినరీ ఆర్టీసీ బస్సులో దాదాపు 120 మంది ప్రయాణికులతో కిక్కిరిసిపోయి నిలబడేందుకు కూడా స్థలం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు రంగాపురం అనంతరం కరకగూడెం, పినపాక, బయ్యారం సహా చాలా గిరిజన గ్రామాలకు మణుగూరు దగ్గరలోని పట్టణం అక్కడికి వెళ్లడానికి రంగాపురం నుండి మణుగూరు ఇదొక్కటే బస్సు సౌకర్యం. ఉదయం 10:00 గంటలకు రంగాపురం నుండి బయలుదేరాల్సిన బస్సు 10:30 అయినా రావడం లేదు. మణుగూరు చేరేసరికి మధ్యాహ్నం 12:00 నుండి 12:30 అవుతోంది. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు, కూలీలు తీవ్రంగా నష్టపోతున్నారు. బస్సులోపల మహిళలు, విద్యార్థులు ఒకరిపై ఒకరు పడుతూ, రాడ్లు పట్టుకొని వేలాడుతున్నారు. కాలు పెట్టడానికి కూడా చోటు ఉండడం లేదని ప్రయాణికుల వాపోతున్నారు. మహిళలు పిల్లలతో సహా గంటల తరబడి నిలబడి ప్రయాణించాల్సి వస్తుంది.
క్లాసులు మిస్ అవుతున్న కాలేజీ విద్యార్థులు
10 గంటలకు రావాల్సిన బస్సు 10:30కి వస్తుంది. పినపాక కాలేజీకి 11:30కి చేరుతుంది విద్యార్థులు ఫస్ట్ క్లాస్ మిస్ అవుతున్నామని ఇంటర్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కరగూడెం మండల గిరిజన ప్రాంత ప్రజల కోసం తక్షణమే రంగాపురం-మణుగూరు రూట్‌లో ఉదయం 11:00 గంటలకు అదనపు బస్సు నడపాలని, ఉన్న బస్సును సకాలంలో 10:00 గంటలకు నడపాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
ఆర్టీసీ అధికారులు ఏజెన్సీ ప్రాంత సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.









