ముచ్చటగా మూడోసారి మండల అధ్యక్షుడిగా సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్

గోల్డెన్ న్యూస్/కరకగూడెం/ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండే నాయకుడిగా గుర్తింపు పొందిన సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వరుసగా మూడోసారి నియమితులయ్యారు.

ఆయన పార్టీ అభివృద్ధికి అందించిన సేవలు, కార్యకర్తలను సమన్వయం చేస్తూ మండలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో చూపిన నాయకత్వాన్ని గుర్తించిన పార్టీ అధిష్ఠానం మరోసారి ఈ బాధ్యతలను అప్పగించింది.

తనపై విశ్వాసం ఉంచి వరుసగా మూడోసారి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించిన పార్టీ అధిష్ఠానానికి రాష్ట్ర, జిల్లా నాయకత్వం, మండల నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు.

“పార్టీ బలోపేతమే ధ్యేయం – ప్రజాసేవే ప్రాణం” అనే లక్ష్యంతో సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ మండలంలోని ప్రతి గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయనున్నారు.

ఆయన మూడోసారి మండల అధ్యక్షుడిగా నియమితులు కావడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నాయకత్వంలో కరకగూడెం మండలంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram