తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అన్నా లెజినోవా

శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.17 లక్షల విరాళం అందజేత .

 

 

గోల్డెన్ న్యూస్ /తిరుపతి/ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకున్న ఆమె, శనివారం ఉదయం సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం టీటీడీ అధికారులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేశారు.

 

ఇటీవల పవన్ కల్యాణ్ భుజానికి శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో మొక్కు తీర్చుకునేందుకు అన్నా లెజినోవా తిరుమలకు వచ్చినట్లు తెలిసింది. ఈ సందర్భంగా తన కుమారుడు మార్క్ శంకర్ పేరుతో శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.17 లక్షల విరాళాన్ని అందజేశారు.

 

అలాగే తిరుమలలో భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేసి, వారితో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. రష్యాకు చెందిన అన్నా లెజినోవా, పవన్ కల్యాణ్‌ను వివాహం చేసుకున్న తర్వాత హిందూ సంప్రదాయాలను అనుసరిస్తూ పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

 

ఇదిలా ఉండగా, భుజానికి శస్త్రచికిత్స అనంతరం పవన్ కల్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈరోజు ఆయన అధ్యక్షతన జనసేన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది.

Facebook
WhatsApp
Twitter
Telegram