గోల్డెన్ న్యూస్ / కోరుట్ల/ జగిత్యాల జిల్లా కోరుట్ల బస్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును గుర్తుతెలియని వ్యక్తి ఎత్తుకెళ్లిన ఘటన సంచలనం రేపుతుంది. కోరుట్ల బస్టాండ్లో నిలిపి ఉన్న ఆర్టీసీ బస్సును ఓ గుర్తు తెలియని వ్యక్తి దొంగలించుకొని నిజామాబాదు వైపు వెళ్తుండగా గమనించిన ఆర్టీసీ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోరుట్ల, మెట్పల్లి పోలీసులు వెంబడించి ఇబ్రహీంపట్నం మండలం గండి హనుమాన్ దేవాలయం వద్ద ఆర్టీసీ బసును స్వాధీనం చేసుకుని, నిందితున్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Post Views: 252









