గోల్డెన్ న్యూస్/ కరకగూడెం / బూర్గంపాడు మండలం టేకుల చెరువు గ్రామానికి చెందిన 40 కుటుంబాలకు ప్రభుత్వం పరంగా అధికారికంగా లిస్టు తయారుచేసి ప్రకటించిన అధికారులు ఇంత మటుకు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు సిపిఎం పార్టీ బృందం ఆ ప్రాంతాన్ని సందర్శిస్తూ
జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డబల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇంత మట్టికి ఇవ్వకపోవడం బాధాకరమైన విషయం అని అన్నారు
గత బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూములు నిర్మాణం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డబల్ బెడ్ రూమ్ ఇళ్లను టేకుల చెరువు గ్రామానికి చెందిన 40 కుటుంబాలకు శాంక్షన్ చేసి లిస్ట్ ప్రకటించి ఇంత మటుకు ఇవ్వబడటం సోషనీయమని అన్నారు
ఇంకా అక్కడ పూర్తిగా ఇల్లు నిర్మాణం పనులు కాకపోవటం దారుణమని అన్నారు మంచినీటి సదుపాయాం లేదు కరెంటు ఇళ్లల్లో వైరింగ్ లేదు రోడ్లు లేవు మరుగుదొడ్లు లేవు వెంటనే మౌలిక సదుపాయాలను వెంటనే పూర్తి చేసి నిరుపేద కుటుంబాలకు ఇవ్వాలని ప్రభుత్వం అధికారులు స్పందించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అన్నారు
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, మండల కమిటీ సభ్యులు పాండవుల రామనాథం, టేకుల చెరువు సిపిఎం సర్పంచ్ సైదమ్మ, శాఖ కార్యదర్శి బోల్ల శ్రీశైలం, బిచ్చం, కాక రాఘవమ్మ సంపత్, తదితరులు పాల్గొన్నారు









