గోల్డెన్ న్యూస్ // తూప్రాన్ // ఎటువంటి అర్హతలు లేకుండా 15 ఏళ్లుగా వైద్యం చేస్తున్న నకిలీ డాక్టర్ గుట్టురట్టు చేసిన మెదక్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని భవాని ప్రథమ చికిత్సాలయం పై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
సలీలా అనే మహిళ ఎలాంటి అర్హత లేకున్న అక్రమ వైద్యం చేస్తునట్టు అధికారులు గుర్తించారు. సలీలా కేవలం జీఎంఎం కోర్సు మాత్రమే పూర్తి చేసిందని, డాక్టర్‌గా వైద్యం చేసేందుకు డిప్యూటీ డిఎంఎచ్వో డాక్టర్ అనిల్ రెడ్డి నుండి ఎలాంటి అనుమతులు పొందలేదని అధికారులు తెలిపారు. ఏ అర్హత లేకపోయినప్పటికీ డాక్టర్‌గా చెలామణి అవుతూ గత 15 సంవత్సరాలుగా వైద్యం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.
Post Views: 36









