యాంటీ పేపర్ లీక్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం.. పేపర్ లీక్‌కు పాల్పడితే రూ10 కోట్ల జరిమానా
పబ్లిక్ పరీక్షల్లో అక్రమ పద్ధతులను నివారించేందుకు ఉద్దేశించిన యాంటీ పేపర్ లీక్ బిల్లును గురువారం పార్లమెంట్ ఆమోదించింది. ఈ బిల్లు ఇప్పటికే బుధవారం లోక్‌సభలో ఆమోదం పొందింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు వాకౌట్ చేసినప్పటికీ రాజ్యసభలో మూజువాణి ఓటుతో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లును ఆమోదించారు.
కాగా, సవరించిన ఈ బిల్లు ప్రకారం పరీక్ష పేపర్ల లీక్‌కు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధిస్తారు. పేపర్ల లీక్‌లు, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారికి కనీసం 5 ఏండ్లు, గరిష్ఠంగా 10 ఏండ్లు కారాగార శిక్ష విధిస్తారు. దీనితో పాటు రూ. 50 లక్షల జరిమానా విధిస్తారు. ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించిన వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే వారికి ఏడేండ్ల కనీస శిక్షతో పాటు రూ.10 కోట్ల జరిమానా విధిస్తారు.









