రేగా కాంతారావు ఎదుగుదలను ఓర్వలేక తప్పుడు ఆరోపణలు

జిల్లా లో రేగాకి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక చిల్లర రాజకీయాలు చేస్తున్నారు…

కరకగూడెం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రావుల సోమయ్య గారు

 

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం / పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు మీద వస్తున్న ఆరోపణలను కరకగూడెం మండలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఖండించారు. మండల అధ్యక్షులు రావుల సోమయ్య కార్యాలయం వేదిక గా మాట్లాడుతూ…ఒక ఆదివాసి బిడ్డ ఉపాధ్యాయ స్థాయి నుంచి జిల్లా అధ్యక్షుడిగా రేగా కాంతారావు ఎదగడాన్ని చూసి జీర్ణించుకోలేక వ్యక్తిగత ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము.న్యాయస్థానం మీద పూర్తి నమ్మకం ఉంది..న్యాయంగా పోరాడి ఈ అసత్య ప్రచారాలను తిప్పికొడతామని తెలియజేస్తున్నాము.అదేవిధంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ నిత్యం ప్రజల మధ్య ప్రజలతో ఉంటూ ప్రజా సమస్యలపై నిత్యం ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా పినపాక మాజీ శాసనసభ్యులు, భద్రాద్రి జిల్లా అధ్యక్షులు  రేగా కాంతారావు మీద కుట్రలు చేస్తూ ఆయన రాజకీయ ప్రయాణాన్ని అడ్డుకోవాలి అని చూస్తున్న అధికార పార్టీ నాయకులు జాగ్రత్త గా వుండాలి..అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు ప్రతి ఆడబిడ్డను తన సోదరిగా భావించి వారి కష్టానికి నేను అండగా ఉంటాను అని చెప్పే రేగా అన్న మీద చిల్లర రాజకీయాలు చేస్తే సహించేది లేదు. మీరు ఎంత అనగతొక్కాలి అని అనుకుంటే అంత వేగంగా పైకి వస్తాడు…ఈ అసత్య ప్రచారాల వెనుక ఉన్న వాళ్ళని అదేవిధంగా చేపించిన వాళ్లని త్వరలోనే బయటికి లాగే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు…

Facebook
WhatsApp
Twitter
Telegram