శీరీష మృతికి కారణమైన నిందితుడు సానద్ ఉల్లా ఖాన్‌కు కఠిన శిక్ష పడాలి
బాధిత కుటుంబానికి తక్షణ న్యాయం చేయాలి
తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలేబోయిన వెంకటనారాయణ
భద్రాద్రి కొత్తగూడెం : నర్సు శీరీష మృతి ఘటనపై తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలేబోయిన వెంకటనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శీరీష మృతికి సంబంధించి నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సానద్ ఉల్లా ఖాన్‌పై సమగ్ర విచారణ జరిపి, నేరం రుజువైతే చట్ట ప్రకారం కఠిన శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఒక నర్సు తన ప్రాణాలను లెక్కచేయకుండా ఇతరుల ప్రాణాలను కాపాడే సేవ చేస్తుంది. అలాంటి సేవా వృత్తిలో ఉన్న శీరీష ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం.ఈ ఘటనపై నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు” అని వెంకటనారాయణ ఘాటుగా వ్యాఖ్యానించారు.
శీరీష మృతిపై పూర్తిస్థాయి, నిష్పక్షపాత దర్యాప్తు జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, సాక్ష్యాధారాల ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
సానద్ ఉల్లా ఖాన్‌పై వచ్చిన ఆరోపణలు నిజమని దర్యాప్తులో తేలితే, ఎలాంటి రాజకీయ లేదా ఇతర ఒత్తిళ్లకు తలొగ్గకుండా కఠినమైన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నిందితుడు ఎవరైనా చట్టం ముందు సమానమే. అని ఆయన అన్నారు.
న్యాయం ఆలస్యం అయితే మరో అన్యాయానికి అవకాశం ఇచ్చినట్టే!
బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి తక్షణ న్యాయం, తగిన పరిహారం, భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళలు, నర్సులు మరియు రాత్రి వేళల్లో విధులు నిర్వహించే ఉద్యోగుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.
శీరీష కుటుంబానికి న్యాయం జరగాలి…
నేరం చేసిన వారికి శిక్ష పడాలి… మహిళలపై హింసకు అడ్డుకట్ట వేయాలి. శీరీషకు న్యాయం జరిగే వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో మా పోరాటం కొనసాగుతుంది. అని పోలేబోయిన వెంకటనారాయణ స్పష్టం చేశారు.









