1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ర్యాలీ..
ఆరు గ్యారంటీలు, 420 హామీలపై నిలదీత
గోల్డెన్ న్యూస్ /కరకగూడెం / కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు, రావుల సోమయ్య విమర్శించారు. హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు శుక్రవారం కరకగూడెం మండల కేంద్రంలో భారీ ర్యాలీ, నిరసన కార్యక్రమం నిర్వహించారు.
బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ బొమ్మ వరకు చేరుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు తీరును వివరిస్తూ ‘కాంగ్రెస్ మోసాల జాబితా’ పేరుతో ముద్రించిన ప్లకార్డులను ప్రదర్శించారు. నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మాజీ ఎంపీపీ రేగా కాళిక మాట్లాడుతూ..
మహిళలకు నెలకు రూ.2,500, వృద్ధులు, దివ్యాంగులకు రూ.4 వేల పింఛన్, రైతులకు ఏటా రూ.15 వేల పెట్టుబడి సాయం, రైతు కూలీలకు రూ.12 వేల సాయం వంటి హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని అన్నారు. వరికి క్వింటాల్‌కు రూ.500 బోనస్, ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి వంటి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ హయాంలో రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాలు సమర్థంగా అమలయ్యాయని ఆమె పేర్కొన్నారు. మండల అభివృద్ధిలో స్థానిక అధికారులు పూర్తిగా విఫలమయ్యరని అన్నారు.
ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేసే వరకు ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని అన్నారు. హామీలు నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో ప్రజలే ప్రభుత్వానికి తగిన సమాధానం చెబుతారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు:పాయం క్రిష్ణవేణి,కొమరం విజయ,పోలెబోయిన రాణి,రేగా శ్వేత,గొగ్గల మల్లేశ్వరి,చందా విజయలక్ష్మి,పోలెబోయిన సంధ్యరాణి,కోమరం కవిత,చందా వసంత,సోయం అంజని,సర్పంచువట్టం సందీప్,ఉప సర్పంచులు:మంచాల లామణ్య,బుడగం రాము యాకుబ్ ఖాన్,కొప్పు కాంతారావు,మాజీ మార్కెట్ కమిటి ఉపాధ్యాకులు కొమరం రాంబాబు,మాజీ సర్పంచులు ఊకే రామానాథం,పాయం నర్సింహారావు,కొమరం విశ్వనాథం,కొమరం శ్రీను,చందా వసంతారావు,మాజీ ఉప సర్పంచులు అక్కిరెడ్డి మాధవి,అత్తె సత్యనారయణ,పోగు వెంకటేశ్వర్లు,యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్, బైరిశెట్టి చిట్టి బాబు, నాయకులుఎల్లు రామక్రిష్ణ,యగ్గడి శ్రీను గాందర్ల సతీష్,తాటి వెంగళరావు,తోలెం రామారావు,బత్తని సీతయ్య,అత్తె ముకుందా,కొమ్మ ప్రసాద్,పోలెబోయిన కార్తిక్,ప్రభాకర్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









