కళ్లకు వెలుగు… జీవితానికి వెలుగు!
ప్రజలందరి ఆరోగ్య దృష్టిని కాపాడే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరం అందరికీ ఓ వరం లాంటిది. అరుదైన ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకొని, మీ కంటి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోండి. జి, సంజీవరావు ఆప్తాల్మిక్ అధికారి కోరారు.
మణుగూరు : ఈనెల 8 వ తారీకు మంగళవారం నాడు ఏరియా హాస్పిటల్ మణుగూరు నందు కంటి వైద్య శిబిరం:- 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల కార్యక్రమం లో భాగంగా సెప్టెంబర్ 8వ తారీఖున ఏరియా హాస్పిటల్ మణుగూరు నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కంటి వైద్య శిబిరం నిర్వహించబడును. కంటి వైద్య శిబిరంలో కంటి శుక్లాలు కలవారిని గుర్తించి వారికి త్వరలో ఉచిత కంటి ఆపరేషన్లు చేయించబడును. కావున పినపాక, కరకగూడెం, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, ఆళ్ళపల్లి, గుండాల మండలాల ప్రజలు 8వ తారీఖున ఏరియా హాస్పిటల్ మణుగూరు నందు కంటి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాము.జి. సంజీవరావు, ఆప్తాల్మిక్ఆఫీసర్, మణుగూరు.









