గోల్డెన్ న్యూస్ /కరకగూడెం/ అక్షరాస్యత అంటే చదవడం, రాయడం, సమర్థవంతంగా మాట్లాడటం – వినగల సామర్థ్యంతో మనుషులు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం. ఈ సామర్థ్యం ప్రాథమిక మానవ హక్కుల సాకారాన్ని సాధ్యం చేస్తుంది. అలాగే సానుకూల మానవ ప్రవర్తన, సామాజిక భాగస్వామ్యం, అభివృద్ధికి దారితీ మార్గంగా పనిచేస్తుంది.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డి ఆర్ డి ఏ సెర్ప్ మరియు జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో గత సంవత్సరాము నిర్వహించిన ఉల్లాస్ “అమ్మకు అక్షర మాల ” ద్వారా విద్య ను అభ్యసించిన అభ్యాసకులు, విద్యార్థులు ల తో అక్షర మాల పక్షోత్సవాలు లో భాగంగా అభ్యాసకులు, విద్యార్థులు తో ర్యాలీ తదనంతరం సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశం నకు ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎంపిడివో పి. శ్రీనివాస్ మాట్లాడుతూ.. మనం మంచిగా విద్యాబుద్ధులు నేర్చుకుని ఉన్నత లక్ష్యాలు ను సాధించుట తో పాటు మన చుట్టూ వున్న అందరికి విద్యను అందించాలి అని అదే విధంగా చదువు మధ్యలో ఆపివేసిన వారితో ఓపెన్ టెన్త్, ఇంటర్ కట్టించాలి అని సూచించారు. ఈ కార్యక్రమం లో ఎమ్ పి డి ఓ పి. శ్రీనివాస్, ఎపిఎం సెర్ప్ బి. వినోద్ క్రాంతి, హైస్కూల్ ఇంచార్జి పుష్పలత, సీసీ లు విజయలక్ష్మి, సత్యనారాయణ, మండల సమాఖ్య అధ్యక్షులు సరస్వతి, ఉపాధ్యాయులు, వీవో ఏ లు పాల్గొన్నారు










