శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

-రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మారుస్తున్న రేవంత్ ప్రభుత్వం

-కేసిఆర్ ఫామ్ హౌస్ పై దాడికి ప్రయత్నించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి*

అక్రమ అరెస్టులతో బీఆర్ఎస్ ను అడ్డుకోలేరు

కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిపై బీఆర్ఎస్ నాయకులు కొవ్వొత్తులతో నిరసన,ర్యాలీ

 

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం / తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో నేరాల రేటు పెరిగిపోయిందని,శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మండల అధ్యక్షులు రావుల సోమయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

మంగళవారం మండల కేంద్రంలో అక్రమ అరెస్టులు,దాడులను నిరసీస్తూ బీఆర్ఎస్ నాయకులు అంబేద్కర్ విగ్రహం సాక్షిగా కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు రావుల సోమయ్య మాట్లాడుతూ…రాష్ట్రంలో ప్రజాపాలనతో అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం రావణ కాష్టంగా మారిందని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర సాధకుడు,మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ ఫామ్ హౌస్ పై దాడికి ప్రయతించడం మూర్ఖత్వమని ఆరోపించారు.దాడికి ప్రయతించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని,కుట్ర దారులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా అసెంబ్లీని ప్రతిపక్షం లేకుండా కొనసాగించాలని కాంగ్రెస్ ప్లభుత్వం చేస్తున్న వైఖరిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించారు.అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం,మహిళ ఎమ్మెల్యే పట్ల అసభ్యంగా ప్రవర్తించడం సిగ్గుచేటని విమర్శించారు.రాజ్యాంగబద్ధంగా కొనసాగించాల్సిన అసెంబ్లీని కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఏటుపోతుందో అర్థం కావడం లేదని ఆయన మండిపడ్డారు.అక్రమ అరెస్టులు,నిర్బంధాన్ని బీఆర్ఎస్ పోరాటాన్ని ఎవరు ఆపలేరని ఆయన స్పష్టం చేశారు.రానున్న రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ నాయకులకు తగిన బుద్ధి చెప్తారని సూచించారు.అసెంబ్లీని కాంగ్రెస్ ప్రభుత్వ ఏకపక్షంగా వైఖరికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు,ప్రజా ప్రతినిధులు,మాజీ ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు,మహిళ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram