ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్

 

హైదరాబాద్ : ఇద్దరు యువతులును మోసం చేసిన ఓ కానిస్టేబుల్‌ను ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పదేళ్లుగా ప్రేమించిన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి.. ఆపై మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో అటు ప్రియురాలు, ఇటు భార్య ఇద్దరూ కలిసి కానిస్టేబుల్‌పై ఫిర్యాదు చేశారు.

 

ఖమ్మం జిల్లాకు చెందిన అరుణ్ కుమార్ సీఐడీ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. తన క్లాస్‌మేట్‌తో పదేళ్లుగా ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి మోసం చేసి.. ఆపై ముఖం చాటేశాడు. ప్రేమించిన యువతికి తెలియకుండా జులైలో మరో యువతిని వివాహం చేసుకున్నాడు. అనుమానం వచ్చిన ప్రేమికురాలు ఆరా తీయగా పెళ్లి విషయం బయటపడింది. మోసపోయాయని గ్రహించిన బాధితురాలు ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో అరుణ్‌కుమార్‌పై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఉప్పల్ పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు. అరుణ్‌కుమార్ అరెస్ట్ విషయం తెలుసుకున్న అతని భార్య ఖమ్మంలో అతనిపై ఫిర్యాదు చేసింది. దీంతో ఖమ్మం పోలీసులు కానిస్టేబుల్‌పై మరో కేసును నమోదు చేశారు..

Facebook
WhatsApp
Twitter
Telegram