గోల్డెన్ న్యూస్ /కరకగూడెం /వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణ కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం సమత బట్టుపల్లి కుర్ణవెళ్లి గ్రామానికి చెందిన యువత మట్టి వినాయక ప్రతిమను గత మూడు సంవత్సరాలుగా తయారు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.కెమికల్స్, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (PoP) వంటి హానికరమైన పదార్థాలను ఉపయోగించకుండా పూర్తిగా సహజసిద్ధమైన మట్టితో ఈ విగ్రహాలను తయారు చేస్తున్నారు. నదులు, చెరువులు కలుషితం కాకుండా కాపాడటానికి గిరిజన యువత ముందుకు వచ్చి ఈ మట్టి విగ్రహాలను తయారు చేస్తుండటంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Post Views: 111









