ములుగు జిల్లాలో విషాదం

విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి

వాజేడు : ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరులో విషాదం చోటుచేసుకుంది. పొలాల్లో డ్రిప్ పేపర్ పరుస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ తో సమ్మయ్య, అభిషేక్ మృతి చెందారు. ఈ ఘటనలో నరేశ్ కు  గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన నరేశ్ ను చికిత్స నిమిత్తం ఏటూరునాగారం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Facebook
WhatsApp
Twitter
Telegram