హైదరాబాద్ : హైడ్రా తన అధికారిక పోర్టల్‌ను శుక్రవారం నుంచి ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని కమిషనర్ ఏవీ రంగనాథ్ తన కార్యాలయంలో ప్రారంభించారు. దీంతో ఈ విభాగం అందిస్తున్న సేవల వివరాలతో పాటు కార్యకలాపాలను తెలుసుకునే అవకాశం ఏర్పడింది. చెరువుల హద్దులు, కాలువల లెక్కలు, ప్రభుత్వ భూముల వివరాలు, విపత్తు నిర్వహణ సమాచారంతో పాటు హైడ్రా కార్యకలాపాలన్నీ ఈ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. 24 గంటలూ అందుబాటులో ఉండే అత్యవసర హెల్ప్ లైన్ ‘1070’ వివరాలను పోర్టల్లో పొందుపరిచారు. చెట్లు కూలిపోవడం, అగ్ని ప్రమాదాలు, రహదారులపై నీరు నిలవడం, వరదలు, సహాయక చర్యలు, ఇతర విపత్తు సంబంధిత అత్యవసర పరిస్థితులపై పౌరులు ఈ నంబరుకు సమాచారం ఇవ్వొచ్చు. హైడ్రా పోర్టల్ ద్వారానే ఫైర్ సేఫ్టీ ఎన్ఎసీలకు దరఖాస్తు చేసుకునే సౌకర్యం ఉంది భవన యజమానులు, నిర్మాణదారులు దరఖాస్తు చేసుకోవడంతో పాటు అది ఏ దశలో ఉందో ఈ ఫోటో ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ పోర్టల్ ద్వారా ప్రజలు చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లు, వరదలు/నీటి నిల్వలకు గురయ్యే ప్రాంతాలు, ప్రత్యక్ష వర్షపాతం, వాతావరణ సమాచారం, భూ రికార్డులను తెలుసుకోవచ్చు.
హైడ్రా వెబ్‌సైట్:
https://hydraa.telangana.gov.in









