ప్రియుడిని నమ్మి వెళ్తే..
ముక్కలు ముక్కలుగా నరికాడు
హనుమకొండ హసన్‌పర్తికి చెందిన స్వప్న(40) భర్త చనిపోవడంతో.. తల్లిదండ్రుల వద్దే ఉంటోంది
గతంలో తల్లిదండ్రులతో కలిసి పూజ కోసం బళ్లారికి వెళ్లినప్పుడు.. డ్రైవర్ బసవరాజ్‌తో పరిచయం
అది వివాహేతర బంధానికి దారితీయగా.. పెళ్లి చేసుకోవాలని బసవరాజ్‌ను కోరిన స్వప్న
అతను ఒప్పుకోకపోవడంతో.. సీక్రెట్ ఫోటోలు, వీడియోలను బయటపెడతానని బెదిరించిన స్వప్న
తన పరువు పోతుందనే భయంతో.. ఆమెను చంపాలని ప్లాన్ వేశాడు బసవరాజ్
పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. మే 15న బళ్లారికి రమ్మని స్వప్నను పిలిపించాడు
సిద్ధేశ్వర ఆలయం వద్ద చంపేసి.. స్వప్న మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు
ఆధారాలు దొరకకుండా ఉండేందుకు.. ఫోన్‌ని చెరువులో పడేసి, బట్టలను తగలబెట్టేశాడు
మరోవైపు.. స్వప్న కనిపించకుండా పోవడంతో మే 31న పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు
కాల్ డేటా, లొకేషన్ సాయంతో.. బసవరాజ్‌ను అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు
తానే చంపానని నేరం అంగీకరించడంతో.. అతడ్ని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలింపు









