కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం

గిరిజనుల ఆశాజ్యోతి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం

 

 కరకగూడెం : తెలంగాణలో గిరిజనుల (ST) రిజర్వేషన్లను 6 శాతం నుండి 10 శాతానికి పెంచడం ద్వారా గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యాసంస్థల్లో సీట్లు,నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మునుపెన్నడూ లేని విధంగా అవకాశాలు లభించాయని హర్షం వ్యక్తం చేస్తూ గిరిజన‌ సంఘాలు,బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి,బీఆర్ఎస్ అధినేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) చిత్రపటానికి ఘనంగా క్షీరాభిషేకం నిర్వహించారు. గిరిజనుల దశాబ్దాల కలలను సాకారం చేస్తూ గత ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షులు కొమరం రాంబాబు మాట్లాడుతూ…గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 500 జనాభా కలిగిన గిరిజన గూడెలు, తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడం వల్ల గిరిజనులే సర్పంచ్‌లుగా మారి,తమ ప్రాంతాలను తామే స్వయంగా అభివృద్ధి చేసుకునే గొప్ప అవకాశం దక్కిందని పేర్కొన్నారు.ప్రత్యేక పంచాయతీలుగా మారడం వల్ల ప్రభుత్వ నిధులు నేరుగా ఆయా గ్రామాలకు కేటాయించబడ్డాయని,మట్టి రోడ్లును సిసి రోడ్లుగా మారడంతో పాటు,తాగునీరు మౌలిక వసతుల కల్పన వేగవంతంగా జరిగిందని వారు గుర్తుచేశారు.గిరిజన సంక్షేమానికి,ఆత్మగౌరవానికి పెద్దపీట వేసిన కేసీఆర్ గారి నిర్ణయాలు తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయని ఈ సందర్భంగా గిరిజన సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రావుల సోమయ్య,రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు అక్కిరెడ్డి వెంకటరెడ్డి,గిరిజన మండల నాయకులు మలకం వెంకటేశ్వర్లు,కొమరం విశ్వనాథం,తాటి వెంగళరావు,గొగ్గల నారాయణ,తోలెం రామారావు,సోయం సునీల్, ఈసం రఘుబాబు, పడిగా అశోక్,పోగు వెంకటేశ్వర్లు,బైరిశెట్టి చిరంజీవి,గుడ్ల రంజిత్ కుమార్,కటకం లెనిన్,ఏల్లు రామకృష్ణారెడ్డి,పటాన్ యాకుబ్ ఖాన్,నిట్టా ఏడుకొండలు,సయ్యద్ యాకుబ్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram