తెలంగాణలో వాతావరణం మార్పు

తెలంగాణలో వాతావరణం మార్పు.. పలు జిల్లాల్లో ఉరుములతో వర్షాలు

 

హైదరాబాద్: తెలంగాణలో సోమవారం ఉదయం వరకు వేడి, ఉక్కపోత వాతావరణం కొనసాగనుంది. మధ్యాహ్నం నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చెదురుమదురు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

 

మెదక్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జనగాం, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, నారాయణపేట జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. రాత్రివేళ ఈ ప్రాంతాల్లో వర్షాలు పెద్దగా ఉండకపోవచ్చని అంచనా.

 

నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లో రాత్రి నుంచి ఉదయం వరకు చెదురుమదురు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

 

హైదరాబాద్‌లో మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉండగా, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.

Facebook
WhatsApp
Twitter
Telegram