చంపాపేట్ : తెలంగాణ పోలీస్ శాఖలో మరో విషా దం చోటుచేసుకుంది. అంబర్పేట్ హెడ్క్వా ర్టర్స్లో రైటర్గా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ (35) ముసారాంబాగ్ శాలివా హన నగర్ లోని తన ఇంట్లో ఉరేసుకుని మృతి చెందాడు. అంతకుముందు అర్ధరాత్రి ఓ యువతికి వీడియో కాల్ చేసి తాను ఉరే సుకోబోతున్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో యువతి వెంటనే చైతన్యపురి పోలీసు లకు సమాచారం అందించింది. ఆమె సమా చారంతో చైతన్యపురి పోలీసులు మలక్పేట్ పోలీసులకు విషయం తెలియజేశారు. ఘట నా స్థలానికి చేరుకున్న మలక్పేట్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్ ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
Post Views: 17









