లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీపీఓ, మరో వ్యక్తి

మంచిర్యాల :  భీమిని మండలం పెద్దపేట గ్రామ పరిపాలన అధికారి (GPO) దుర్గాప్రసాద్ భూమి బదలాయింపు ధ్రువీకరణ, పట్టాదారు పాస్బుక్ల జారీకి  రూ.1.30 లక్షల లంచం డిమాండ్ చేసి 80 తీసుకొని ఏసీబీ అధికారులు చిక్కారు

 

2026 సెప్టెంబర్ 22న పెద్దపేట శివారులోని వ్యవసాయ పొలాల సమీపంలో ఆదిలాబాద్ అధికారులు ఏసీబీ ట్రాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ ఫిర్యాదుదారుడి నుంచి డిమాండ్ చేసిన రూ.1.30 లక్షల్లో మొదటి విడతగా రూ.80 వేల నగదును

స్వీకరించేందుకు మరో వ్యక్తి పొతు రాజేందర్ (33)2 ఉపయోగించినట్లు అధికారులు పేర్కొన్నారు. ట్రాప్ సమయంలో దుర్గాప్రసాద్.. రాజేందర్తో కలిసి అతని ద్విచక్రవాహనంపై అక్కడికి వచ్చి, రూ.80 వేల నగదును రాజేందర్కు ఇవ్వాలని ఫిర్యాదుదారుడికి సూచించినట్లు ఏసీబీ తెలిపింది. దీంతో ఫిర్యాదుదారుడు రూ.80 వేల నగదును రాజేందర్కు అందజేశారు. అనంతరం ఏసీబీ అధికారులు ఆ నగదును రాజేందర్ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు.

రాజేందర్ చేతులకు నిర్వహించిన రసాయన పరీక్షలో పాజిటివ్ ఫలితం వచ్చిందని ఏసీబీ అధికారులు తెలిపారు. భూమిని ఫిర్యాదుదారుడి పేరుపై బదలాయింపు ప్రక్రియను పూర్తి చేయడం, పట్టాదారు పాస్బుక్లు జారీ చేయడంలో అధికారిక అనుకూలత చూపేందుకు దుర్గాప్రసాద్ రూ.1.30 లక్షలు డిమాండ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అందులో రూ.80 వేలను మొదటి విడతగా, మిగిలిన రూ.50 వేలను పని పూర్తయిన తర్వాత ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.

 

అధికారిక పదవిని దుర్వినియోగం చేస్తూ లంచం డిమాండ్ చేసి, మరో వ్యక్తి ద్వారా రూ.80 వేల మొదటి విడత లంచాన్ని స్వీకరించినట్లు ఏసీబీ పేర్కొంది.

Facebook
WhatsApp
Twitter
Telegram