–కరకగూడెం తహసీల్దార్ వట్టం కాంతయ్య
-వాగులు,వంకలు దాటొద్దు..
-విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలి
కరకగూడెం : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మండలంలో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ వట్టం కాంతయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు.వర్షాల సమయంలో అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావాలని సూచించారు.లోతట్టు ప్రాంతాలు, చెరువులు,వాగులు,వంకల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చిన్నారులు నీటి ప్రవాహాల వైపు వెళ్లకుండా తల్లిదండ్రులు పర్యవేక్షించాలని సూచించారు.వరద నీరు రహదారులపై ప్రవహిస్తున్న సమయంలో వాహనాలతో వెళ్లే సాహసం చేయవద్దన్నారు.అలాగే విద్యుత్ స్తంభాలు,తెగిపడిన వైర్లకు దూరంగా ఉండాలని తెలిపారు.వర్షాల కారణంగా ఏదైనా ఇబ్బంది లేదా వరద పరిస్థితి ఏర్పడితే వెంటనే రెవెన్యూ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు.








