బాదావత్ రవిచంద్రను హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి 

బాదావత్ రవిచంద్రను హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి

 అట్రాసిటీ కేసు నమోదు చేసి గిరిజన కుటుంబానికి న్యాయం చేయాలి

సిపిఎం పార్టీ డిమాండ్

కరకగూడెం : మండలంలోని కలవలనాగారం గ్రామానికి చెందిన బాదావత్ రవిచంద్ర ను హత్య చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి గిరిజన కుటుంబానికి న్యాయం చేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కొమరం కాంతారావు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇది అత్యంత దుర్మార్గమైన చర్య అని హత్యకు పాల్పడిన వారు ఎవరైనా సరే విచారణ నిష్పక్షపాతంగా జరిపి ఘటనకు కారకులైన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు చర్ప సత్యం పాల్గొన్నారు

Facebook
WhatsApp
Twitter
Telegram