అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు – ఎస్పీ రోహిత్ రాజు

కొత్తగూడెం : పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ఈనెల 21 నుండి  31 వరకు వివిధ కార్యక్రమాల నిర్వహణ – భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు.దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.

ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న నిర్వహించే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించడంతో పాటు, ప్రజలకు పోలీసు శాఖ సేవలు, బాధ్యతలు, త్యాగాలపై అవగాహన కల్పించేలా వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా ఓపెన్ హౌస్ కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, ర్యాలీలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు, పోలీస్ అమరవీరుల కుటుంబాల పరామర్శ వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. పోలీసుల విధులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, ప్రజల భద్రతలో పోలీసుల పాత్రను ప్రజలకు వివరించనున్నారు. అలాగే పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో బహిరంగ ప్రదేశాల్లో అమరవీరుల త్యాగాలను వివరిస్తూ పాటల కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, ప్రధాన కూడళ్లలో అమరవీరుల సంస్మరణ బ్యానర్లను ఏర్పాటు చేయనున్నారు.

వ్యాసరచన పోటీలు..(తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషలలో) కేటగిరి – 1ఇంటర్మీడియట్ వరకు విద్యార్థిని విద్యార్థుల కోసం.1. సైబర్ నేరాల నివారణలో పోలీసుల – పౌరుల పాత్ర.2. డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర….విద్యార్థులు డ్రగ్స్ నుండి ఎలా దూరంగా ఉండగలరు.

కేటగిరి -2 డిగ్రీ మరియు ఆపై చదువుతున్న విద్యార్థుల కోసం 1. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడంలో పోలీసుల పాత్ర. 2. తెలంగాణను మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో నా పాత్ర. పోలీస్ అధికారులకు.

కేటగిరి -1 కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐ స్థాయి వరకు..1. ప్రజాస్వామ్య వ్యవవస్థలో ప్రజలు పోలీసుల నుండి ఎటువంటి సేవలను ఆశిస్తారు.2. పోలీసు అధికారుల జీవితాల్లో సోషల్ మీడియా పాత్ర – సోషల్ మీడియా కు బానిస కాకుండా ఉండటం మరియు వ్యక్తిగత మరియు సామాజిక ప్రయోజనాల కోసం దానిని సద్వినియోగం చేసుకోవటం ఎలా.

కేటగిరి – 2 ఎస్.ఐ మరియు పై స్థాయి అధికారులు..1. పౌరుల మన్ననలు పొందటానికి పోలీసులు చేయవలసిన కృషి.2. నెలస్థాయి పోలీసు వ్యవస్థ బలోపేతం చేయడం ఎలా.ఈవ్యాసరచన పోటీలను తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ భాషలలో నిర్వహించాలని, 500 పదాలకు మించకుండా వ్యాసరచనలో పాల్గొని, ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురికి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అర్హత లభిస్తుందని తెలియజేశారు.షార్ట్ ఫిలిమ్స్, ఫోటోగ్రఫీ పోటీలు: జిల్లాలోని విద్యార్థులు, యువత, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. పోలీసుల సేవలు, రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాలపై అవగాహన, కమ్యూనిటీ పోలీసింగ్, మూఢనమ్మకాల నిర్మూలన, ప్రకృతి వైపరీత్యాల సమయంలో పోలీసుల సేవలు తదితర అంశాలపై ఫోటోలు, వీడియోలను రూపొందించవచ్చు. షార్ట్ ఫిలిమ్స్ మూడు నిమిషాలకు మించకుండా ఉండాలి. ఉత్తమంగా నిలిచిన ఎంట్రీలను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు.పోటీల్లో పాల్గొనదలచిన వారు తమ ఫోటోలు, వీడియోలను అక్టోబర్ 24వ తేదీలోపు చుంచుపల్లి పోలీస్ స్టేషన్ పైన ఉన్న ఐటీ కోర్ విభాగంలోని ఐటీ కోర్ సీఐ రాముకు అందజేయాలని ఎస్పీ సూచించారు.విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలు, త్యాగాలు సమాజానికి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని, దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం వారు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఈ సందర్భంగా తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram