రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో రూ. 20 లక్షల లంచం తీసుకుంటూ ACB కి పట్టుబడ్డ ఇద్దరు అధికారులు
అబ్దుల్లాపూర్ మెట్ మండలం, రంగారెడ్డి జిల్లాకు చెందిన..
AO-1: శ్రీ బతుక శ్రీనివాసులు, మండల సర్వేయర్,
AO-2: శ్రీ బి. సుదర్శన్ రెడ్డి, తహసీల్దార్, అబ్దుల్లాపూర్ మెట్ మండలం
ఇరువురు కలిసి ఒక భూమి సంబంధిత పని కోసం ఫిర్యాదుదారుని నుండి రూ. 20,00,000/- (రూపాయలు ఇరవై లక్షలు) లంచం డిమాండ్ చేసి, తీసుకుంటుండగా. అవినీతి నిరోధక శాఖ (ACB), సిటీ రేంజ్ – CIU అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఫిర్యాదుదారుని భూమి విషయంలో అధికారికంగా చేయవలసిన పనికి అక్రమంగా ఈ మొత్తాన్ని డిమాండ్ చేసినట్లు ACB విచారణలో తేలింది…
నిందితుల నుండి లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని, వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు…
Post Views: 11









