వాట్సాప్లో సైబర్ మోసాలు.. NO అని రిప్లై ఇస్తే ఖాతా ఖాళీ..!!
సైబర్ క్రిమినల్స్ వాట్సాప్ మోసాలకు పాల్పడుతున్నారని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ‘మీ బ్యాంక్ అకౌంట్ నుంచి కొంత అమౌంట్ కట్ అయింది. ఆ ట్రాన్సాక్షన్ మీరు చేయకపోతే వెంటనే NO అని రిప్లై ఇవ్వండి’ అని మెసేజులు పంపుతున్నారని చెప్పారు. NO అని రిప్లై ఇచ్చిన వెంటనే మాల్వేర్ స్క్రిప్ట్ యాక్టివేట్ అయి ఖాతాలో డబ్బులు కట్ అవుతాయన్నారు. అలాంటి మెసేజులకు YES లేదా NO అని రిప్లై ఇవ్వొద్దని హెచ్చరించారు..!!
Post Views: 24









