విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్
తాడ్వాయి / గ్రామీణ ప్రాంతంలో ఉన్న క్రీడాకారుల అనే రంగులు రాణించాలని రంగాపురం సర్పంచ్ ఇర్ప శివ ప్రసాద్ అన్నారు.శుక్రవారం తాడ్వాయిసమ్మక్క-సారలమ్మ మండలంలోని రంగాపూర్ స్కూల్ గ్రౌండ్ నందు ఏడు మండలాల స్థాయి ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్ ను అట్టహాసంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ ఇర్ప శివ ప్రసాద్ మాట్లాడుతూ…ఐపీఎల్ తరుణంలో జరిగే క్రికెట్ టోర్నమెంట్ గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించడం అభినీయమని అన్నారు.ఏజెన్సీలో అణిముత్యం లాంటి క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి టోర్నమెంట్ ఎంతో ఉపయోగపడతాయాని సూచించారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సర్పంచ్ ఎర్రం పోట్టయ్య,ఉప సర్పంచ్ ఇర్ప పుల్లయ్య, సెక్రెటరీ రవికుమార్,మాజీ ఉపసర్పంచ్ జవ్వాజి మోహన్ రావు,ఇర్ప సూర్యనారాయణ,గుమ్మడి ముత్తయ్య, టోర్నమెంట్ నిర్వాకులు గుడ్ల రంజిత్ సుధాకర్,ఎట్టి ప్రసాద్, గ్రామస్తులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.









