మూతవడ్డ ఎం ఆర్ సి కరకగూడెం మండల కార్యాలయం..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాష్ట్ర సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం టి ఎస్ ఎస్ యు ఎస్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా. మంగళవారం నుంచి విద్యాశాఖ లోని సమగ్ర శిక్షా ఉద్యోగుల సమ్మె సైరన్..
పెన్ డౌన్, చాక్ డౌన్ వలన. కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాలల్లో, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ భవిత సెంటర్లలో ఆగనున్న బోధన..
ఈ సమ్మెలో జిల్లా విద్యాశాఖ కార్యాలయాల సిబ్బంది, మండల విద్యాశాఖ కార్యాలయాల సిబ్బంది, క్లస్టర్ పాఠశాలల సిబ్బంది, ఉన్నత పాఠశాలలోని ఒకేషనల్ ఇన్ స్ట్రక్టర్ సిబ్బంది పాల్గొనడం వలన టెక్నీకల్ ఆన్లైన్ పనులు, యు డి ఐ ఎస్ ఇ, ఏ ఏ పీ ఏ ఆర్, ఎండిఎం బిల్స్ లాంటి కార్యక్రమాలకు ఆటంకాలు ఏర్పడనున్నాయి, పాఠశాల విద్యాశాఖ కార్యాలయాలు వెల వెల బోయి స్తంభించనున్న పాఠశాల విద్యాశాఖ అడ్మినిస్ట్రేషన్.
33 జిల్లాలలో ప్రతి జిల్లా కేంద్రంగా జిల్లా స్థాయిలో ఈ నిరవధిక సమ్మె కొనసాగుతోంది..









