గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు

 మొదటి రోజు 87 దరఖాస్తులు స్వీ కరణ.

గోల్డెన్ న్యూస్/ కరకగూడెం : భూభారతి చట్టం అమలులో భాగంగా మంగళవారం మండలంలోని కొత్తగూడెం, గొల్లగూడెం గ్రామాల్లో అధికారులు  రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సుల్లో భూములకు సంబంధించిన సమస్యలు అర్జీల రూపంలో తీసుకుని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నారు. అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలన, విచారణ చేపట్టి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. భూ యజమానులు, రైతులు వారి భూ రికార్డుల్లో తప్పులు, అర్హత ఉండి రెవెన్యూ రికార్డుల్లో పేర్లు నమోదు కాకపోవడం, విస్తీర్ణం సంబంధించిన ఇతర సమస్యలు పరిష్కరించుకునేందుకు వీలుంది. గ్రామాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సదస్సు కొనసాగనున్నాయి. డిప్యూటీ తాసిల్దార్ వట్టం కాంతయ్య. రెవిన్యూ ఇన్స్పెక్టర్ పోలబోయిన కృష్ణ ప్రసాద్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram