విప్ప గింజలను ఆసక్తిగా పరిశీలించిన కలెక్టర్.

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  కలెక్టర్ జితేష్  వి పాటిల్ శుక్రవారం కరకగూడెం మండలం పర్యటనలో భాగంగా బంగారుగూడెం గ్రామం మీదుగా ప్రయాణిస్తున్న  క్రమంలో రహదారి వెంట విప్ప గింజలను ఆరబోయగా కలెక్టర్ ఆగి వాటిని ఆసక్తిగా పరిశీలించారు. అక్కడ ఉన్న గిరిజన మహిళలతో మాట్లాడుతూ విప్ప గింజల నుండి నూనె ఎలా తయారు చేస్తారు? విప్ప పూలు ఎన్ని విధాలుగా ఉపయోగిస్తారు? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఆ గ్రామంలోని చిన్నారులకు నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేసి వారితో మమేకమై వారి బాగోగులు గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ పర్యటనలో కలెక్టర్ వెంట అశ్వాపురం తాసిల్దార్, రెవెన్యూ సిబ్బంది ఏపీవో సీతారామయ్య, టి ఏ వెంకటేష్, ఎఫ్ ఏ రమేష్,సర్ఫ్ ఏ పీ ఎం సత్యనారాయణ, సీసీ సౌభారాణి,మరియు పంచాయతీ అధికారులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram