ఘనంగా బక్రీద్ వేడుకలు

గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పర్వదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో వేడుకలను నిర్వహిస్తున్నారు. పండుగ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లోని మసీదులు, ఈద్గాలకు తెల్లవారుజాము నుంచే క్యూకట్టారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటున్నారు. కొత్తబట్టలు ధరించి పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నారు. ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు  కలుపుకున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram