అసంపూర్తి రోడ్డు పనులు పూర్తి చేయాలి.

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం  జిల్లా కరకగూడెం మండలం చిరుమల్ల గ్రామపంచాయతీ పరిధిలోకౌలూరు గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని  స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతున్న రోడ్డు సౌకర్యం లేని గ్రామాలు చాలానే ఉన్నాయి ప్రభుత్వాలు మారుతున్న ఇప్పటివరకు వాళ్లకు  రోడ్డు సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం  ప్రజాప్రతినిధులు విస్మరిస్తున్నారని, గత ప్రభుత్వంలో ఐటీడీఏ సమీకృత గిరిజన అభివృద్ధి ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణం కొరకు మెటల్ పోయడం జరిగింది అప్పటినుండి నేటి వరకు ఆ మెటల్ మీదనే నడుస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా మార్గం మధ్యలో కలవర్టు దగ్గర మట్టి కోత గురవుతూ తూములు బయటపడటంతో నిత్యం  రాకపోకలకు  ఇబ్బంది కలుగుతుందని రానున్న వర్షషాకాలం దృష్టిలో ఉంచుకొని రోడ్డు పనులు   పర్తిచేయాలని పినపాక తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు చందా మధు,బిజెపి నాయకుడు బైరిశెట్టి వెంకన్న కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సోలం వెంకటేశ్వర్లు కొట్టెం రాము సోలం కృష్ణ తదితరులు పాల్గొన్నారు

Facebook
WhatsApp
Twitter
Telegram