ప్రేమ పెళ్లి చేసుకుందని..బతికున్న బిడ్డకు కర్మక్రియలు

కని, పెంచిన బిడ్డ తమ మాట వినకుండా ప్రేమ పెళ్లి చేసుకుందని తల్లిదండ్రులు మనస్తాపానికి గురయ్యారు. బతికుండగానే తమ కుమార్తె చిత్రపటానికి నివాళులర్పించి, కర్మక్రియలు జరిపారు.

తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కన్నబిడ్డకు బతికుండగానే కర్మక్రియలు చేసిన ఘటన చిత్తూరు జిల్లా పిళ్లారికుప్పంలో చోటుచేసుకుంది. హేమప్రియ అనే యువతి తల్లిదండ్రుల మాట వినకుండా అదే గ్రామానికి చెందిన కిశోర్ను ప్రేమించి వివాహం చేసుకుంది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె తల్లిదండ్రులు, కుమార్తె మృతి చెందినట్టుగా భావిస్తూ ఆమె ఫోటోకు నివాళులు అర్పించి కర్మక్రియలు నిర్వహించారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది..

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram