తల్లి కావాలా? వద్దా? అనేది మహిళ ఇష్టమేనని చెప్పిన ఉన్నత న్యాయస్థానం

తల్లి కావాలా? వద్దా? అనేది మహిళ ఇష్టమేనని చెప్పిన ఉన్నత న్యాయస్థానం. 

30వారాల గర్భాన్ని తొలగించేందుకు సుప్రీం అనుమతి

న్యూ ఢిల్లీ :మహిళల గర్భదారణ అంశంపై సుప్రీం కోర్టు ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. మరీ ముఖ్యంగా మైనర్ల విషయంలో ఇష్టానికి విరుద్ధంగా అవాంఛిత గర్భధారణ జరిగినప్పుడు వారికి ఉన్న హక్కుల గురించి ధర్మాసనం కీలకమైన వ్యాఖ్యలు చేసింది.

బాయ్ ఫ్రెండ్ వల్ల 17ఏళ్ల వయసులో గర్భం దాల్చిన ఓ అమ్మాయికి తన 30 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. తన శరీరానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే హక్కు సదరు యువతికే ఉంటుందని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.అలాగే ఇష్టం లేని గర్భాన్ని దాల్చాలని ఏ స్త్రీని బలవంతం చేయలేమని న్యాయమూర్తులు తెలిపారు. బాధితురాలి మానసిక స్థితిని పరిగణనలోకి తీసుకుని వెంటనే అబార్షన్ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

 

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram