గాలివానకు కిందపడిన విద్యుత్‌ స్తంభాలు

పినపాక మండలంలో ఆదివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. కురిసిన వర్షానికి తోడు ఈదురు గాలులకు విద్యుత్‌ స్తంభాలు, విద్యుత్‌ తీగలు కిందపడిపోయాయి.

 

గోల్డెన్ న్యూస్ /పినపాక / తోగ్గుడెం గ్రామంలో ఆదివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. కురిసిన వర్షానికి తోడు ఈదురు గాలులకు 5 విద్యుత్‌ స్తంభాలు, విద్యుత్‌ తీగలు కిందపడిపోయాయి. ఈ సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. తోగూడెంలోని స్కూలు సమీపంలో  సంఘటన చోటుచేసుకుంది. చెట్టుకు పెద్ద కొమ్మ విరిగి విద్యుత్‌ లైన్‌పై పడి విద్యుత్‌ స్తంభం, విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. ఈ సమయంలో ఈ ప్రాంతంలో జనసంచారం లేకపోవటంతో ప్రమాదం తప్పింది. దీంతో గ్రామానికి విద్యుత్‌ సరఫరాను నిలిపివేసి విద్యుత్‌ లైన్‌కు మరమ్మతులు చేసి విద్యుత్ పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram