తెలంగాణలో రాత్రి వర్షాల జోరు..
పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు!
గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ /తెలంగాణలో నేడు వర్షాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో ఏర్పడుతున్న అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తర, పశ్చిమ, తూర్పు జిల్లాల్లో తాత్కాలికంగా వర్షాలు చురుకుగా కొనసాగే అవకాశం ఉంది.
ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మెదక్, జనగామ, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో రాత్రి నుంచి రేపటి ఉదయం వరకు విస్తృతంగా మోస్తరు నుంచి తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సాయంత్రం వరకు పొడి వాతావరణం కొనసాగి, ఆ తర్వాత వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఇతర జిల్లాల్లో అక్కడక్కడా లేదా చెదురుమదురుగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.
హైదరాబాద్‌లో సాయంత్రం వరకు పొడి వాతావరణం ఉండే అవకాశం ఉండగా, రాత్రి నుంచి రేపటి ఉదయం వరకు అక్కడక్కడా వర్షపు జల్లులు కురిసే అవకాశం ఉంది.









